War 2: కీలక అప్డేట్‌.. ఈసారి రచ్చే..!

War 2: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik roshan) ప్రస్తుతం వార్ 2 (War 2) పనుల్లో మునిగిపోయాడు. అయితే వార్ 2 కోసం కష్టపడుతున్న సమయంలోనే గాయపడ్డాడు. దీంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. ఇక నెక్ట్స్ వీక్ నుంచి హృతిక్ సెట్‌లోకి అడుగు పెట్టబోతోన్నాడట. గాయపడ్డా తగ్గేదేలే అంటూ సెట్స్‌లోకి రాబోతోన్నాడట.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గాయపడ్డ సంగతి తెలిసిందే. క్రచెస్ పట్టుకుని దాని సాయంతో నడుస్తున్నాడు. అలా హృతిక్ రోషన్ వార్ 2 కోసం కష్టపడుతూ గాయపడ్డా కూడా ఇప్పుడు మళ్లీ తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు రెడీ అయ్యాడు. వార్ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వచ్చే వారం నుంచి ప్రారంభించే వార్ 2 కొత్త షెడ్యూల్‌లో హృతిక్ రోషన్ పాల్గొనబోతోన్నట్టుగా సమాచారం.

ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే వార్ 2 సెట్స్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 25న విడుదలైన ఫైటర్ బాలీవుడ్‌లో మంచి వసూళ్లనే సాధించింది. త్వరలో వార్ 2 మొదలు కాబోతోందని, ఇకపై బహుశా ఊపిరి తీసుకునే టైం కూడా ఉండదేమో అని రీసెంట్‌గా హృతిక్ రోషన్ తన షెడ్యూల్ గురించి మాట్లాడాడు. వార్ చిత్రంలో ఏజెంట్ కబీర్ పాత్రతో హృతిక్ అందరినీ ఆకట్టుకున్నాడు. హృతిక్, టైగర్ ష్రాఫ్‌ల యాక్షన్ సీక్వెన్స్‌లు అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.

వార్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో రెండో పార్ట్ మీద అంచనాలు భారీగా పెరిగాయి. ‘వార్ 2’లో ఈ సారి హృతిక్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ (JR NTR) ఢీ కొట్టబోతోన్నాడని చెప్పడంతే ఈ ప్రాజెక్ట్ మీద పాన్ ఇండియా వైడ్‌గా చర్చలు మొదలయ్యాయి. ఈ స్పై యూనివర్స్‌లో తారక్ భాగం కాబోతుండటంతో సౌత్‌లోనూ వార్ 2 మీద చర్చలు మొదలయ్యాయి. ఇక, ఇండియాలో ఇద్దరు టాప్ పాన్ ఇండియా స్టార్స్ వార్ 2 చిత్రంపై ఫ్యాన్స్‌ సెలెబ్రేట్ చేసుకునేలా ఉంటుంది. ఇటు సౌత్‌లో ఉన్న అభిమానులకు, నార్త్‌లో ఉన్న అభిమానులకు ఈ చిత్రం ఒక పండగే.

యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్‌ని మరింత కొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ ఫిబ్రవరి 23 నుంచి వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో దర్శకుడు అయాన్ ముఖర్జీ.. హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్‌ని రెండు వారాల పాటు చిత్రికరించబోతున్నారట. ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించే విధంగా మైండ్ బ్లోయింగ్ యాక్షన్‌తో హృతిక్ ఇంట్రడక్షన్ ఉండబోతోందట.

గాయపడ్డ హృతిక్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే ఫిబ్రవరి 23 నుంచి వార్ 2 షూటింగ్‌లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో దర్శకుడు అయాన్ ముఖర్జీ.. హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్‌ని రెండు వారాల పాటు చిత్రికరించబోతున్నాడని సమాచారాం. మైండ్ బ్లోయింగ్ యాక్షన్‌తో హృతిక్ ఇంట్రడక్షన్ ఉండబోతోందని బీ టౌన్ టాక్. వార్ 2 కోసం పర్ఫెక్ట్ బాడీ షేప్‌ను తీసుకొచ్చేందుకు హృతిక్ జిమ్‌లో కష్టపడుతున్న సమయంలోనే గాయపడ్డాడన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆగష్టు 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.