Jawan: జ‌వాన్ చెత్త సినిమా.. అన‌వ‌స‌రంగా న‌టించా

viraj ghelani regrets working in atlee film jawan

Jawan: త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ తీసిన జ‌వాన్ సినిమాలో న‌టించి త‌ప్పు చేసాన‌ని.. దానంత చెత్త సినిమా మరొక‌టి లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్ అయిన విరాజ్‌కి జ‌వాన్ సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఈ సినిమా కోసం దాదాపు 15 రోజుల పాటు మ‌ధ్ అనే ద్వీపంలో షూటింగ్ చేసాడ‌ట‌. అయితే సినిమాలో షారుక్ ఖాన్, సంజ‌య్ ద‌త్ ఉన్నారు కాబ‌ట్టి అట్లీతో పాటు సెట్‌లో ఉన్న‌వారు కేవ‌లం వారిద్ద‌రికే మ‌ర్యాద ఇచ్చేవార‌ని.. త‌న లాంటి వారిని మాత్రం అక్క‌డెళ్లి నిల‌బ‌డు.. ఇక్క‌డికి వ‌చ్చి కూర్చో అని గ‌ద‌మాయిస్తూ అవ‌మానించారని వెల్ల‌డించారు. 15 రోజులు షూట్ చేస్తే కేవ‌లం ఒక స‌గం రోజు చేసిన సీన్‌ని మాత్ర‌మే పెట్టుకుని మిగ‌తాదంతా క‌ట్ చేసార‌ని తెలిపారు. ఈ విష‌యం త‌న భార్య‌కు స్నేహితుల‌కు చెప్తే వారు క‌నీసం ఓటీటీలో కూడా ఈ చెత్త సినిమాను చూడాల‌నుకోలేద‌ని తెలిపారు.