Project K: ప్ర‌భాస్ లుక్ డిలీట్ చేసేసారా?

Hyderabad: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) న‌టిస్తున్న ప్రాజెక్ట్ K (project K) సినిమా నుంచి ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఫ‌స్ట్ లుక్ నిన్న రిలీజ్ అయింది. అయితే ఫ‌స్ట్ లుక్ మాత్రం డిస‌పాయింట్ చేసింద‌నే చెప్పాలి. ఫ్యాన్స్ ఊహించిన రేంజ్‌లో లుక్ లేక‌పోగా ఏదో బాడీకి ప్ర‌భాస్ ఫేస్ అతికించిన‌ట్లుగా ఉండ‌టంతో సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దాంతో ఈ సినిమా నిర్మాణ సంస్థ వైజ‌యంతి మూవీస్ (vijayanthi movies) నిన్న రిలీజ్ చేసిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను త‌మ సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ నుంచి డిలీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. లుక్‌ని కాస్త మోడిఫై చేసి మ‌రో పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. బ్యాక్‌గ్రౌండ్‌లో చిన్న మార్పులు చేసిన‌ట్లు మాత్ర‌మే న్యూ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తోంది. ఇప్ప‌టికైనా డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ (nag ashwin) ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసి టైటిల్ గ్లింప్స్ కానీ టీజ‌ర్ కానీ రిలీజ్ చేస్తే బాగుంటుంది.