Vijayakanth: విష‌మంగా విజ‌య్‌కాంత్ ఆరోగ్య‌ ప‌రిస్థితి

ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు విజ‌య్‌కాంత్ (vijayakanth) ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మ‌ధుమేహంతో బాధ‌ప‌డుతున్న విజ‌య్‌కాంత్‌కు గ‌తంలో కాలి వేళ్ల‌ను తొల‌గించాల్సి వ‌చ్చింది. ఆ త‌ర్వాత కొంత‌కాలం పాటు బాగానే ఉన్న ఆయ‌న‌కు మ‌ళ్లీ అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. త‌మిళ‌నాడులోని ఓ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న విజ‌య్‌కాంత్ ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని వైద్యులు బులెటిన్ విడుద‌ల చేసారు. దాంతో ఆయ‌న క్షేమంగా కోలుకుని రావాల‌ని అభిమానులు, చిత్ర ప‌రిశ్ర‌మ కోరుకుంటోంది.