డ్యాన్స్ వేణుమా డ్యాన్స్ ఇరుక్కు.. ట్రోల్స్ విజ‌య్ షేర్ చేసారు

Hyderabad: ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు(dil raju)పై ఎన్నో ట్రోల్స్, మీమ్స్ హ‌ల్‌చ‌ల్ చేసాయి. త‌మిళ(tamil) సినిమా వారిసు(vijay varisu) ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో దిల్‌రాజు(dil raju) మాట్లాడుతూ.. 2 కాఫీ క‌ప్స్‌తో సార్ ఎంట్రీ.. డ్యాన్స్ వేణుమా డ్యాన్స్ ఇరుక్కు.. ఫైట్ వేణుమా ఫైట్ ఇరుక్కు.. అదిదా సార్.. అంటూ వ‌చ్చీ రాని త‌మిళంలో మాట్లాడి న‌వ్వుల‌పాల‌య్యారు. దాంతో ఆయ‌న‌పై ఎన్నో మీమ్స్ వైర‌ల్ అయ్యాయి. అయితే వాటి గురించి త‌న‌కు కూడా తెలుస‌ని అంటున్నారు దిల్ రాజు. స‌మంత న‌టించిన శాకుంత‌లం సినిమాకు ఆయ‌న నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 14న రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స‌మంత‌, ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌తో క‌లిసి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. త‌న‌పై వ‌చ్చిన ట్రోల్స్, మీమ్స్ గురించి స్పందించారు. ఆ మీమ్స్ నాకు విజ‌యే పంపించారు. చూసి న‌వ్వుకున్నాను. కానీ అలాంటివి నేను ప‌ట్టించుకోను అని తెలిపారు. మీ ఫేవ‌రేట్ హీరో ఎవ‌రు అని అడిగితే.. మీరు ఎప్పుడు అడిగినా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే చెప్తాను. నా ఆన్స‌ర్ ఎప్ప‌టికీ మార‌దు అని తెలిపారు.