Kushi: సామ్‌కి తెలియకుండా రౌడీ హీరో రీల్స్!
Hyderabad: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటిస్తున్న చిత్రం ఖుషి(Kushi). దర్శకుడు శివ నిర్వాణ(Shiva Nirvana) రూపొందిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమాను సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అయితే మూవీ టీం ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టేసింది. విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ని కూడా రిలీజ్ చేశారు. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది ఈ పాట. అంతేకాదు వరల్డ్ బెస్ట్ ఆడియో చార్ట్ బస్టర్స్ లో ఐదవ స్థానాన్నిసొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.
తాజాగా సెట్స్ లోని ఒక వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ, సమంతకి తెలియకుండా తనతో చేసిన ఒక ఇన్‌స్టా రీల్ షేర్ చేశారు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే సాంగ్ లిరిక్స్ తగట్టు విజయ్, సమంతతో ఆ రీల్ ని చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ నటించిన లైగర్, సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. శివ నిర్వాణకు కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కాలంటే ఈ సినిమా విజయం తప్పనిసరి.