Samantha: మాటలు రావట్లేదు.. థాంక్యూ మై హీరో!
Hyderabad: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) నటించిన శాకుంతలం(Shaakunthalam) రేపు(ఏప్రిల్ 14) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. గుణశేఖర్(Guna Shekar) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా గడిపిన సమంత(Samantha) కాస్త అస్వస్థతకు గురయ్యారు. కాగా, సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ రౌడీ హీరో విజయ్(Vijay Deverakonda) దేవరకొండ సోషల్ మీడియా ద్వారా సామ్‌కు ఎమోషనల్‌గా లేఖ రాశారు. ‘ఏం చెప్పాలో అర్థం కావట్లేదు.. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతే అవసరం. థాంక్యూ మై హీరో’ అంటూ విజయ్‌కి బదులిచ్చింది సామ్.
ఇక రేపు సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఓ ఎమోషనల్ లేఖ రాశారు విజయ్. ‘గత ఏడాది కాలంగా నువ్వు ఓ యోధురాలిగా పోరాడుతున్నావు. ఆరోగ్యం బాలేకపోయినా ప్రేక్షకులను అలరించేందుకు కష్టపడుతున్నావు. నువ్వు ఎప్పుడూ ఉత్సాహంగా, అందరితో ప్రేమగా ఉంటావు. ఎంచుకునే సినిమాలపైనే కెరీర్ ఆధారపడి ఉంటుందని భావిస్తావు. శాకుంతలం చిత్రానికి నా శుభాకాంక్షలు. నీ సంకల్పంతోపాటు లక్షలాది అభిమానుల ప్రేమ నిన్ను కాపాడుతుంది’ అంటూ రాసుకొచ్చారు విజయ్. సామ్ కూడా విజయ్‌కి ఎమోషనల్‌గా రిప్లై ఇవ్వడంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
విజయ్, సమంత జంటగా మహానటి(Mahanati) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి(Kushi) సినిమాలో నటిస్తున్నారు. కాగా, వీరిద్దరూ మంచి స్నేహితులు. చాలాసార్లు విజయ్, సామ్ మీదున్న అభిమానాన్ని చాటుకున్నారు.