Kushi Trailer: పెళ్లి గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ్

Hyderabad: పెళ్లి గురించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయని అన్నారు విజయ్ దేవ‌ర‌కొండ‌ (vijay devarakonda). ఆయ‌న యాక్ట్ చేసిన ఖుషి ట్రైల‌ర్ (kushi trailer) రిలీజ్ అయిన సంద‌ర్భంగా విజ‌య్ ఇంట్రెస్టింగ్ విష‌యాలు చెప్పారు. లైగ‌ర్ ఫ్లాప్ త‌ర్వాత ల‌వ్ స్టోరీస్ అస‌లు చేయ‌న‌ని చెప్పారు విజ‌య్. ఇప్పుడు మ‌ళ్లీ ఖుషి అనే ల‌వ్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ల‌వ్ స్టోరీలు చేయ‌న‌ని చెప్పి మ‌ళ్లీ ఎందుకు చేస్తున్నారు అని అడిగితే.. “” గ‌తంలో లవ్ అంటే చిరాకు వ‌చ్చి చేయ‌కూడ‌దు అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ న‌చ్చుతోంది. ల‌వ్ మ్యారేజెస్, విడాకులు ఇలా అన్నీ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉన్నాయి. ఒకప్పుడు పెళ్లి గురించి ఎవ‌రైనా మాట్లాడితే ఇరిటేట్ అయ్యేవాడిని. ఇప్పుడు పెళ్లి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. నాకు తెలిసి త్వ‌ర‌లో చేసుకుంటానేమో అనిపిస్తోంది.“” అన్నారు. (kushi trailer)

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిఫ‌రెన్స్

ప్రెస్ మీట్‌లో ఓ క‌న్న‌డ జ‌ర్న‌లిస్ట్ విజయ్‌ని అడిగిన ప్ర‌శ్న హైలైట్‌గా నిలిచింది. క‌న్న‌డ‌లో కొన్నేళ్ల క్రితం ఆల్రెడీ ఖుషి (kushi) అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో హీరో ఎవ‌రు అంటూ నాలుగు ఆప్ష‌న్లు ఇచ్చారు. ఈ ప్ర‌శ్న విన్నాక విజ‌య్ కూడా ఒక క్వ‌శ్చ‌న్ వేసారు. 2001లో తెలుగులో ఒక ఖుషి రిలీజ్ అయింది. అందులో ఎవ‌రు యాక్ట్ చేసారు?  A) సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు B) ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని ఆప్ష‌న్స్ ఇచ్చారు. దీనికి క‌న్న‌డ జ‌ర్న‌లిస్ట్ క‌రెక్ట్ ఆన్స‌ర్ ఇచ్చారు. ఆ త‌ర్వాత విజ‌య్ కూడా క‌న్న‌డ ఖుషిలో (kushi) విజ‌య్ రాఘవేంద్ర న‌టించార‌ని క‌రెక్ట్ ఆన్స‌ర్ ఇచ్చారు.

స‌మంత కాకుండా..

ఇక ఈ సినిమాలో ఆరాధ్య క్యారెక్ట‌ర్‌లో స‌మంత‌ను (samantha) కాకుండా ఇంక ఎవ్వ‌రికీ ఊహించుకోలేమ‌ని, త‌న‌కు హెల్త్ బాలేక‌పోయినా సినిమాను కంప్లీట్ చేసినందుకు విజ‌య్ సామ్‌కి థ్యాంక్స్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ ఒక ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని షేర్ చేసారు. సామ్ మ‌యోసైటిస్‌తో బాధ‌ప‌డుతోంది కాబ‌ట్టి షూటింగ్ మ‌ధ్య‌లో ఆపేసి మ‌ళ్లీ ప‌దేళ్ల త‌ర్వాత సినిమాను తీస్తే ఎలా ఉంటుంది అని విజ‌య్, శివ నిర్వాణ‌తో అన్నాడ‌ట‌. అప్పుడు శివ నిర్వాణ ఈ ప‌దేళ్ల‌లో విజ‌య‌వాడ హైవే మీద స‌మంత పేరుతో ఓ ఇడ్లీ బండి పెట్టుకుని అమ్ముకుందామా అని ఫ‌న్నీగా రిప్లై ఇచ్చాడ‌ట‌. (kushi trailer)

నో OTT
ఈ సంద‌ర్భంగా OTT కంటెంట్‌లో అస్స‌లు న‌టించ‌న‌ని చెప్పేసారు విజ‌య్. త‌న సినిమాల‌న్నీ థియేట‌ర్‌లోనే రిలీజ్ అవ్వాల‌ని అన్నారు. అంతేకాకుండా.. సినిమాల‌ను నిర్మించే ప్రోగ్రామ్‌లు ఏమీ పెట్టుకోన‌ని క్లారిటీ ఇచ్చేసారు.