Vijay Devarakonda: నా మ్యారీడ్ లైఫ్ కూడా అలాగే ఉండాలి
Hyderabad: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (vijay devarakonda) తన పెళ్లి కబుర్లను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. ఆయన సమంతో (samantha) కలిసి నటిస్తున్న ఖుషి (khushi) సినిమాలోని ఆరాధ్య సాంగ్ (aradhya song) రీసెంట్గా రిలీజ్ అయింది. ఇందులో విజయ్, సమంతల మ్యారేజ్ లైఫ్‌ని ఈ సాంగ్‌లో చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. మరి మీ పెళ్లి లైఫ్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు అని విజయ్‌ని అడగ్గా.. సరిగ్గా ఆరాధ్య పాటలో ఎలా ఉందో అలాగే ఉండాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
“ఆరాధ్య పాటలో ఒక యంగ్ కపుల్ పెళ్లైన ఏడాదిలో ఎంత ప్రేమగా ఉంటారో చాలా అందంగా చూపించారు. పెళ్లయ్యాక వచ్చే సమస్యలకు ముందు ఉండే బ్యూటిఫుల్ మొమెంట్స్‌ని పాటలో చూపించాం. నాకు పెళ్లి కాలేదు కానీ ఒకవేళ అయితే మాత్రం సరిగ్గా నా జీవితం ఈ పాటలో చూపించినట్లుగానే ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకో ఈ పాటలో చూపించినట్లే నా జీవితం ఉందని అనిపిస్తోంది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మాత్రం నా జీవితం అలాగే ఉండాలని కోరుకుంటున్నా“ అని తెలిపారు.
శివ నిర్వాణ (shiva nirvana) డైరెక్ట్ చేసిన ఖుషి (khushi) సినిమా నుంచి ఇప్పటికే నా రోజా నువ్వే (na roja nuvve) పాట రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ఆరాధ్య పాటకు కూడా మంచి టాక్ వస్తోంది. తన ఫేవరెట్ హీరోయిన్ సమంతతో విజయ్ కలిసి నటించిన సెకండ్ సినిమా ఇది. సెప్టెంబర్ 1న సినిమా రిలీజ్ అవబోతోంది.