Vijay Devarakonda: ర‌ష్మిక వైర‌ల్ వీడియోపై విజ‌య్ కామెంట్

Vijay Devarakonda: ర‌ష్మిక మంద‌న‌కు (rashmika mandanna) సంబంధించిన డీప్ ఫేక్ వీడియో (deep fake video) ఒక‌టి వైర‌ల్ అవ‌డంపై విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించారు. ప్ర‌ముఖ ఇంగ్లీష్ మీడియా ది ప్రింట్ ర‌ష్మిక గురించి రాసిన వార్త‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. “” భ‌విష్య‌త్తు కోసం తీసుకోవాల్సిన అత్య‌వ‌స‌ర‌మైన చ‌ర్య‌లు. ఇలాంటి ఘ‌ట‌న ఏ అమ్మాయికీ జ‌ర‌గ‌కూడ‌దు. ఇలాంటి ఘ‌ట‌న‌ల జ‌ర‌గ‌కుండా ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా ఉండాలంటే వెంట‌నే స్పందించే ఒక సైబ‌ర్ వింగ్, స‌త్వ‌ర చ‌ర్య‌లు అమ‌ల్లోకి రావాలి “” అని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసారు విజయ్