Vijay Devarakonda: మరో సినిమా షురూ చేసిన రౌడీ హీరో!

Hyderabad: టాలీవుడ్​ యంగ్​ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో ఖుషి(Kushi) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రౌడీ హీరో సరసన సమంత(Samantha) జోడీగా నటిస్తోంది. కాగా, లైగర్(Liger)​ సినిమా ఫలితం తర్వాత కాస్త సైలెంట్​ అయిన విజయ్​ మళ్లీ ట్రాక్​ ఎక్కినట్లు తెలుస్తోంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ జెర్సీ(Jersey) సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న #VD12 సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో టాలీవుడ్​ యంగ్​ సెన్సేషన్​ శ్రీలీల(Sreeleela) హీరోయిన్​గా నటించనుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్​ కూడా విడుదల చేసింది చిత్రయూనిట్. దీంట్లో విజయ్ దేవరకొండ స్పై పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. పోస్టర్ రిలీజ్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం నిర్వహించి అందరిని ఆశ్చర్యపరిచాడు రౌడీ హీరో. త్వరలోనే రెగ్యులర్​ షూటింగ్​ ప్రారంభించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.

రామానాయుడు స్టూడియోస్​లో బుధవారం ఉదయం జరిగిన పూజా కార్యక్రమాలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. కన్నడ బ్యూటీ శ్రీలీల ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో విజయ్​ పక్కన నటించనున్నది ఈ భామనే అని తెలుస్తోంది. కాగా ఇప్పటికే శ్రీలీల చేతిలో దాదాపు పది ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఈ సినిమాతో ఈ బ్యూటీ ఖాతాలో మరో సినిమా చేరిపోయింది.