Vijay Devarakonda: రౌడీ కొత్త సినిమా.. బాహుబ‌లి రేంజ్ టైటిల్‌..!

vijay devarakonda new film is titled as ranabhali

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ నుంచి తేరుకుంటున్నారు. ఇప్పుడు ఆయ‌న ఫోక‌స్ అంతా త‌న త‌దుప‌రి సినిమాల‌పై పెట్టారు. ప్ర‌స్తుతం ఆయ‌న టాక్సీవాలా డైరెక్ట‌ర్ రాహుల్ సంకృత్యాన్‌తో క‌లిసి మ‌రో సినిమా చేయ‌బోతున్నారు. ఇదొక పీరియాడిక్ డ్రామా. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం రాహుల్ రెండేళ్లు క‌ష్ట‌ప‌డి విజ‌య్‌ను త‌న న‌రేష‌న్‌తో మెప్పించాడు.

ఈసారి ఏద‌న్నా కొత్త‌గా చేయాల‌ని విజ‌య్ ఈ సినిమాకు ఒప్పుకున్నారు. అయితే ఈ సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ అనుకుంటున్నార‌ట‌. ఈ సినిమాకు ర‌ణ‌భ‌లి అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. 18వ శ‌తాబ్దానికి చెందిన డ్రామాగా ఇది తెర‌కెక్కబోతోంది. ఇందులో విజ‌య్ తండ్రి, కొడుకుగా డబుల్ యాక్ష‌న్ రోల్స్‌లో క‌నిపించ‌బోతున్నాడు. మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం విజ‌య్ గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతోంది.