Vijay Devarakonda: ర‌ష్మిక బ‌ర్త్‌డేకి విజయ్ గ్రాండ్ ప్లానింగ్

Vijay Devarakonda: ర‌ష్మిక మంద‌న (Rashmika Mandanna) పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ గ్రాండ్ ప్లానింగ్ చేయ‌నున్నాడ‌ట‌. రేపు ర‌ష్మిక పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆమె కోసం దుబాయ్‌లో గ్రాండ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ర‌ష్మిక యూఏఈలో ఉంది. అక్క‌డి జంగిల్‌లో నెమ‌లి క‌నిపించ‌గా.. దాని ఫోటో తీసి ర‌ష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. అనుకోకుండా అదే ఫోటో విజ‌య్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా క‌నిపించడంతో వారిద్ద‌రూ క‌లిసే ట్రిప్‌కి వెళ్లార‌ని మ‌రోసారి రుజువైపోయింది. రేపు ర‌ష్మిక బ‌ర్త్‌డేతో పాటు విజయ్ న‌టించిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. కాబ‌ట్టి ఇద్ద‌రికీ రేపు స్పెష‌ల్ డే అనే చెప్పాలి.

ఇక ఫ్యామిలీ స్టార్ గురించి చెప్పాలంటే ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ న‌టించిన రెండో సినిమా ఇది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించారు. ర‌ష్మిక గెస్ట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమా విజయ్ కెరీర్‌లోనే ది బిగ్గెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే అమెరికాలో ఏకంగా 500 స్క్రీన్స్‌పై ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు విజ‌య్ న‌టించిన ఏ సినిమా కూడా ఇన్ని స్క్రీన్ల‌పై రిలీజ్ కాలేదు.