Vijay Devarakonda: వాళ్లని మళ్లీ పెళ్లి చేసుకోమన్నా
ఇంట్లో అమ్మానాన్నలు పెళ్లెప్పుడు అని తెగ ఒత్తిడి చేస్తున్నారని అన్నారు విజయ్ దేవరకొండ (vijay devarakonda). ఆయన సమంత (samantha) జంటగా యాక్ట్ చేసిన ఖుషి (kushi) సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతోంది. ఇందులో విజయ్ సామ్ దంపతులుగా నటించారు. దాంతో విజయ్ తల్లిదండ్రులు ఇక రియల్ లైఫ్‌లో విజయ్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఆశపడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఈ పెళ్లి టార్చర్ ఇంట్లో ఎక్కువ అయిపోయిందట. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్? ఎప్పుడు మనవళ్లను ఇస్తావ్? అంటూ పదే పదే ఒత్తిడి చేస్తున్నారట . దాంతో విజయ్ వారికి ఒక సలహా ఇచ్చాడట. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు కాబట్టి వారినే మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పాడట. (vijay devarakonda)