Vijay Antony: పవన్​ అంటే అభిమానం!

Hyderabad: కోలీవుడ్​ మల్టీటాలెంటెడ్​ హీరో విజయ్​ ఆంటోనీ(Vijay Antony) నటించిన తాజా చిత్రం బిచ్చగాడు 2(Bichgadu 2). ఈ సినిమా ఈరోజు(మే 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2016లో వచ్చిన తమిళ్ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు(Bichagadu)తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్, కోలీవుడ్​తోపాటు టాలీవుడ్​లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. ఇక తన కెరీర్​లో టర్నింగ్​ పాయింట్​గా నిలిచిన బిచ్చగాడు సినిమాకి సీక్వెల్ గా బిచ్చగాడు 2 విజయ్​ స్వీయ దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా ఆంటోనీ(Fathima Antony) నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో కావ్య థాపర్(Kavya Thapar) హీరోయిన్ గా నటించింది.

బిచ్చగాడు 2 ప్రమోషన్స్​లో భాగంగా చిత్రబృందం పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది. తాజాగా విజయ్​ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్​ టాప్​ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విజయ్​ వ్యాఖ్యలు నెట్టింట వైరల్​గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిచ్చగాడు 2 చిత్రానికి సంబంధించిన విశేషాలు మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత విషయాలు, అలాగే తనకి టాలీవుడ్ లో ఇష్టమైన హీరోలు మరియు సినిమాల గురించి కూడా చెప్పుకొచ్చారు. ‘మీకు టాలీవుడ్ లో బాగా ఇష్టమైన హీరో ఎవరు?’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘నేను టాలీవుడ్ లో అందరి హీరోల సినిమాలు చూస్తాను, కానీ నాకు వ్యక్తిగతంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అంటే చాలా అభిమానం. ఆయన తర్వాతే నాకు ఎవరైనా’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్​గా మారడంతో పవన్​ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.