Vijay Antony తండ్రిది కూడా ఆత్మహత్యే..!
ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (vijay antony) కూతురు మీరా ఆత్మహత్య ఘటనతో కోలీవుడ్ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మీరా తన రూంలో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతో కాలంగా మీరా డిప్రెషన్‌లో ఉందని అంటున్నారు. మీరా భౌతికకాయానికి పోస్ట్‌మార్టెం నిర్వహించిన అనంతరం తమిళనాడూలోని ఆళ్లూరుపేటలో ఉన్న విజయ్ ఆంటోనీ నివాసానికి తరలించారు. పొలిటీషియన్లు, సినీ సెలబ్రిటీలు విజయ్ ఇంటికి చేరుకుని సంతాపం తెలుపుతున్నారు.
అయితే.. విజయ్ తండ్రి కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆయన చనిపోయే సమయానికి విజయ్ వయసు కేవలం ఏడేళ్లు. అంత చిన్న వయసులో తండ్రిని కోల్పోయిన విజయ్‌ని ఆయన తల్లే ఎంతో కష్టపడి పెంచింది. “” జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రాణాలు తీసుకోకండి. అది చాలా తప్పు. ఎంత కష్టమొచ్చినా ఎదురెళ్లి పోరాడాలే కానీ ఇలా అర్థాంతరంగా మీకు మీరే ప్రాణాలు తీసేసుకుంటే ఎలా? నా తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు నా వయసు ఏడేళ్లు. నా ఐదేళ్ల చెల్లిని నన్ను మా అమ్మ ఎంతో కష్టపడి పెంచింది“” అని బిచ్చగాడు 2 ప్రెస్ మీట్ సమయంలో ఈ విషయాన్ని వెల్లడించారు విజయ్. ఇప్పుడు విజయ్ కూతురే ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని ఆయన కలలో కూడా ఊహించి ఉండరు. కూతురిని విగతజీవిగా చూసి విజయ్ ఇంకా షాక్‌లోనే ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. (vijay antony)