Vijay Antony కూతురు ఆత్మ‌హ‌త్య‌

ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు విజ‌య్ ఆంటోనీ (vijay antony) కూతురు మీరా (19) ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. ఈరోజు తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో మీరా త‌న గ‌దిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. విజ‌య్ భార్య ఫాతిమా ఉద‌యం లేచి చూడ‌గానే త‌న కూతురు ఫ్యాన్‌కు వేలాడుతుండ‌టం చూసి కుప్ప‌కూలిపోయారు. వెంట‌నే ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు తర‌లించినా ఫ‌లితం లేకుండాపోయింది. కొంత‌కాలంగా మీరా తీవ్ర‌మైన డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతోంద‌ట‌. పోలీసులు కేసును విచారిస్తున్నారు. విజ‌య్ ఫాతిమా దంప‌తుల‌కు ఇద్ద‌రు కూతుర్లు. ఒక‌రు లారా.. మ‌రొక‌రు మీరా. మీరా మృతితో విజ‌య్ కుటుంబం క‌న్నీరుమున్నీర‌వుతోంది. (vijay antony)