Vidya Balan: సౌత్ ఇండ‌స్ట్రీలో ఉన్న డిసిప్లైన్ బాలీవుడ్‌కి లేదు

Vidya Balan:సౌత్ ఇండ‌స్ట్రీలో ఉన్న డిసిప్లైన్ బాలీవుడ్‌కి లేదని అన్నారు విద్యా బాల‌న్. తెలుగులో ఆమె ఎన్టీఆర్ క‌థానాయ‌కుడులో బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడంటే ఆమె బాలీవుడ్‌లో టాప్ న‌టీమ‌ణుల్లో ఒక‌రు. కానీ విద్యా బాల‌న్ త‌న తొలి సినిమాను మ‌ల‌యాళ ప‌రిశ్రమ నుంచే మొద‌లుపెట్టారు. మ‌ల‌యాళంలో చ‌క్రం అనే సినిమాతో విద్యా బాల‌న్ ఎంట్రీ ఇవ్వాల‌నుకున్నారు.

కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాంతో ఆమెను అంతా ఐర‌న్ లెగ్ అనేవారు. దాదాపు 14 సినిమాల నుంచి తీసేసారు. అలా ఆమె త‌మిళంలో ప్ర‌య‌త్నించి చివ‌రికి బాలీవుడ్‌లో స్థిర‌ప‌డింది. త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క్యాస్టింగ్ కౌచ్ కూడా ఎదుర్కొన్నాన‌ని తెలిపింది. అయితే సౌత్ ఇండిస్ట్రీలో ఉన్న డిసిప్లైన్ బాలీవుడ్ సినిమాల్లో లేద‌ని అందుకే సౌత్ సినిమాల‌కు అంత ఆద‌ర‌ణ అని చెప్పుకొచ్చింది విద్యా బాల‌న్.