Venu Swamy: 5 కోట్లు అడుగుతున్నాడు.. మాకు చావు తప్ప మరో దారి లేదు
Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి.. టీవీ5 జర్నలిస్ట్ మూర్తి గురించి షాకింగ్ ఆరోపణ చేసారు. మూర్తి తనను రూ.5 కోట్లు చెల్లించాలని లేదంటే అన్ని విషయాలు బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఇక మాకు చావే శరణం అని అన్నారు. ఈ మేరకు వేణు స్వామి తన భార్య వీణా శ్రీవాణితో కలిసి ఓ వీడియో షేర్ చేసారు. 2017లో మహా టీవీలో పనిచేస్తున్నప్పటి నుంచి మూర్తి తనను మానసికంగా టార్చర్ పెడుతున్నారని అన్నారు. గత 8 నెలలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎంతో మంది కష్టాల నుంచి తొలగించిన తనను మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య ఆలోచనలు వచ్చేలా చేసింది మూర్తే అని తెలిపారు. తాము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అలా చేసుకుంటే తప్పు చేసారు కాబట్టే చనిపోయారు అనుకుంటారని ధైర్యం తెచ్చుకుని బతుకుతున్నామని. తమకు ఏదన్నా జరిగితే దానికి కారణం టీవీ5 మూర్తే అని భార్యాభర్తలు ఇద్దరూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.