Vennira Adai Nirmala షాకింగ్ కామెంట్స్.. బాల‌య్య గురించేనా?

Vennira Adai Nirmala: అల‌నాటి న‌టి వెన్నీరా అడై ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించిన షాకింగ్ అంశాలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఓ ప్ర‌ముఖ న‌టుడి కుమారుడు రాత్రి వేళ‌లో త‌న గ‌ది తలుపులు బాదేవాడ‌ని వెల్ల‌డించారు. దాంతో ఆమె ఎవ‌రి గురించి చెప్తున్నారా అనే చ‌ర్చ మొద‌లైంది. వెన్నీరా అడై చెప్పేది మ‌రెవ‌రి గురించో కాదు. నంద‌మూరి బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) గురించే అట‌.

వెన్నీరా అడై న‌టించిన అన్న‌ద‌మ్ముల అనుబంధం సినిమాలో బాల‌య్య కూడా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అన్న‌దమ్ముల అనుబంధం షూటింగ్ స‌మ‌యంలో నిర్మ‌ల‌, న‌టి అన్న‌పూర్ణ‌కు ప‌క్క ప‌క్క గ‌దులు ఇచ్చార‌ట‌. ఆ స‌మ‌యంలో అర్థ‌రాత్రి బాల‌కృష్ణ నిర్మ‌ల త‌లుపు కొట్టేవాడ‌ట‌. ఈ విష‌యం తెలిసి నిర్మ‌ల కంగుతున్నారు. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే అన్న‌పూర్ణ‌కు ఈ విష‌యం చెప్ప‌డంతో.. ఎంత త‌లుపుకొట్టినా తీయ‌కు అని చెప్పార‌ట‌. దాంతో ఆ సినిమా షూటింగ్ పూర్త‌య్యేవ‌ర‌కు ఆమె అన్న‌పూర్ణ చెప్పిన‌ట్లుగానే ఒక్క‌సారి గ‌దిలోకి వెళ్లాక మ‌ళ్లీ బ‌య‌టికి వ‌చ్చేవారు కాద‌ట‌. (Vennira Adai Nirmala)

ALSO READ: Radhika Apte: టాలీవుడ్ అంటే అస‌హ్యం

గ‌తంలో త‌మిళ న‌టి విచిత్ర‌.. రీసెంట్‌గా బాలీవుడ్ న‌టి రాధికా ఆప్టేలు (Radhika Apte) కూడా బాల‌కృష్ణ గురించి పరోక్షంగా ఇలాంటి విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు. రాధికా ఆప్టే బాల‌కృష్ణ‌తో క‌లిసి లయ‌న్ (Lion), లెజెండ్ (Legend) సినిమాల్లో న‌టించారు. ఈ రెండు సినిమాలు చేస్తున్న స‌మ‌యంలో తాను చాలా ఇబ్బందికి గుర‌య్యాన‌ని.. క‌నీసం సెట్స్‌లో వారు ప‌ట్టించుకునేవారు కూడా కార‌ని కేవ‌లం హీరోకే ప్రాధాన్య‌త ఇచ్చేవార‌ని తెలిపారు. ఈ సంఘ‌ట‌న‌లు, అనుభ‌వాల కార‌ణంగానే తాను టాలీవుడ్‌కి దూర‌మ‌య్యాన‌ని పేర్కొన్నారు.

రాధికా ఆప్టే బాల‌య్య గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం పెద్ద చ‌ర్చ‌కు దారి తీయ‌లేదు. ఎందుకంటే ఆమె ఎక్క‌డా కూడా బాల‌య్య త‌న‌తో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించార‌ని చెప్ప‌లేదు. కానీ వెన్నీరా అడై నిర్మ‌ల లాంటి సీనియ‌ర్ న‌టి ఇలాంటి వ్యాఖ్య‌లు ఇప్పుడు చేస్తున్నారంటే ఇండ‌స్ట్రీకే సిగ్గు చేట‌. పైగా ఎవ‌రో బ‌య‌టి హీరో ఇలా చేసాడంటే అనుకోవ‌చ్చు. నంద‌మూరి వంశం.. మా నాన్న‌గారు అంటూ గొప్ప‌లు చెప్పుకునే బాల‌య్య ఇలాంటి త‌ప్పుడు ప‌ని చేసాడంటే అభిమానులు కూడా న‌మ్మ‌లేక‌పోతున్నారు. చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మ‌రి గుడిసెలు అన్న‌ట్లు.. బాల‌య్య తీసే దాదాపు అన్ని సినిమాల్లో ఆడ‌వారికి ఎలాంటి గౌర‌వం ఇవ్వాలి వారిని ఎలా చూసుకోవాల‌ని అనే నీతుల‌తోనే స‌గం డైలాగులు ఉంటాయి. కానీ ఆ మ‌నిషి అస‌లు స్వ‌రూపం ఇలా ఉంటుంద‌ని ఎవ‌రైనా ఊహించారా.!?