Venkatesh: ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది
Venkatesh: నాగచైతన్య, శోభిత ధూళిపాల నిశ్చితార్థంపై చై మేనమామ విక్టరీ వెంకటేష్ పరోక్షంగా స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆయన పెట్టిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. “” ఏది జరగాలనుంటే అది జరుగుతుంది. మనం ఏం చెప్పాలి అనేది మన తెలివి నిర్ణయిస్తుంది, ఎలా చెప్పాలి అనేది మన నైపుణ్యం నిర్ణయిస్తుంది, ఎంత చెప్పాలి అనేది మన యాటిట్యూడ్ నిర్ణయిస్తుంది, కానీ చెప్పాలా వద్దా అనేది మన జ్ఞానమే నిర్ణయిస్తుంది “” అని ఆయన పోస్ట్ చేసారు.
వెంకీ మామ పోస్ట్‌లను బట్టి చూస్తే ఆయన ఈ నిశ్చితార్థం పట్ల సంతోషంగా లేరనిపిస్తోంది. నిశ్చితార్థ వేడుకలో కేవలం నాగార్జున కుటుంబం ఉందే తప్ప దగ్గుబాటి కుటుంబం ఎక్కడా కనిపించలేదు. 30 ఏళ్ల క్రితం వెంకటేష్ సోదరి విషయంలోనూ ఇదే జరిగింది. వెంకటేష్ సోదరి లక్ష్మితో నాగార్జున తొలి పెళ్లి జరిగింది. వీరిద్దరికి కలిగిన కుమారుడే నాగచైతన్య. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నాగార్జున లక్ష్మీ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగార్జున నటి అమలను పెళ్లి చేసుకున్నారు.