Venkatesh Maha: ఆ హీరో ముఖాన్ని మార్చుకోవచ్చుగా..!
దర్శకుడు వెంకటేష్ మహా (venkatesh maha) ఆల్రెడీ KGF సినిమా గురించి అనుచిత కామెంట్స్ చేసి వివాదంలో ఇరుక్కున్నారు. ఆ తర్వాత సారీ చెప్పారు కానీ తన మాటలను మాత్రం వెనక్కి తీసుకోనని అన్నారు. కేరాఫ్ కంచెరపాలెం (c/o kancharapalem) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న వెంకటేష్ మహా దర్శకుడిగానే కొనసాగాలని అనుకున్నారు. కానీ ఆయన సినిమాలు తీయడం మానేసి ఇప్పుడు సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. ఆయన కీ రోల్లో నటించిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందుకు డైరెక్షన్ చేయడం లేదు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కేరాఫ్ కంచెరపాలెం సక్సెస్ తర్వాత మరో మంచి కథతో ఓ హీరో దగ్గరికి వెళ్లారట. అయితే ఆ హీరో కథ మొత్తం విని పుష్ప లాంటి కథ ఉంటే చెప్పు అన్నారట. ఆ తర్వాత ఇదే కథతో ఇంకో హీరో దగ్గరికి వెళ్తే KGF లాంటి సినిమా అయితే చేస్తానని అన్నారట. దాంతో వెంకటేష్ మహాకు ఒళ్లు మండింది.
ఆ హీరోకి KGF లాంటి సినిమానే చేయాలని ఉన్నప్పుడు ఆయనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తన ముఖాన్ని యష్లాగా మార్చుకుని సినిమా చేయొచ్చు కదా.. ఎందుకు KGFని కాపీ కొట్టాలనుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేసారు. తన కథల్లో దమ్ము ఉంది కాబట్టే మార్చడానికి ఒప్పుకోలేక ఇక డైరెక్షన్ చేయడం ఆపేసానని తెలిపారు వెంకటేష్ మహా. (venkatesh maha)