Venkatesh Daggubati: వెంకీమామ కూతురి నిశ్చితార్థ వేడుక‌లో మెరిసిన తార‌లు

Hayavahini Daggubati: వెంక‌టేష్ (venkatesh daggubati) కూతురు హ‌య‌వాహిని ద‌గ్గుబాటి నిశ్చితార్థం నిన్న రాత్రి ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మ‌హేష్ బాబు, చిరంజీవిలు కూడా హాజ‌రై కాబోయే దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. హ‌య‌వాహిని.. వెంక‌టేష్ రెండో కూతురు. వ‌రుడు విజ‌య‌వాడ‌కు చెందిన డాక్ట‌ర్ కుటుంబానికి చెందిన‌వాడని తెలుస్తోంది. వెంక‌టేష్ పెద్ద కూతురు ఆశ్రిత‌కు 2019లోనే వివాహం అయ్యింది. జైపూర్‌లో ఆశ్రిత వివాహాన్ని వేడుక‌గా నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు నాగ‌చైత‌న్య‌, స‌మంత సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. (hayavahini engagement)