Operation Valentine బ్యాన్ అవ్వబోతోందా?
Operation Valentine: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ఆపరేషన్ వ్యాలెంటైన్ బ్యాన్ అవ్వబోతోందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. శక్తి ప్రతాప్ సింగ్ హదా (Shakti pratap singh hada) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి ఛిల్లార్ (Manushi Chillar) హీరోయిన్‌గా నటించారు. 2019లో ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనికులపై జరిగిన దాడి నేపథ్యంలో ఈ సినిమాను కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే ఇలాంటి నిజ జీవిత సంఘటనల గురించి సినిమాలు తీయాలంటే కచ్చితంగా భారతదేశ డిఫెన్స్ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
వారికి స్క్రిప్ట్‌ను చదివి వినిపించిన తర్వాత అనుమతి ఇస్తేనే షూటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారు ఒప్పుకోకపోతే సినిమా తీసే అవకాశమే ఉండదు. అయితే ఆపరేషన్ వ్యాలెంటైన్‌కు డిఫెన్స్ శాఖ నుంచి పూర్తి మద్దతు లభించింది. అయినా కూడా ఈ సినిమాను గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేయాలని అనుకుంటున్నారట. అక్కడ ఉంటున్న తెలుగు వారు ఇలాంటి దాడులకు సంబంధించిన సినిమాలు చూడటం అటుంచితే.. అసలు ఇలాంటి దాడుల గురించి మాట్లాడినా కూడా పెద్ద నేరమే.
పైగా ఈ సినిమాను బాలీవుడ్‌కి చెందిన సోనీ పిక్చర్స్ (Sony Pictures) హిందీతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా రిలీజ్ చేయాలని అనుకుంటోంది. కానీ ఇందుకు గల్ఫ్ దేశాలు మాత్రం అస్సలు ఒప్పుకోవు. సో.. అక్కడి తెలుగు వారికి ఈ సినిమాను చూసే అవకాశం ఉండదు. ఇప్పటికే ఈ యుద్ధానికి సంబంధించి ఫైటర్, ఆర్టికల్ 370 సినిమాలను గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేసారు. ఇప్పుడు వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలెంటైన్ కూడా అక్కడ రిలీజ్‌కు నోచుకోలేకపోతోంది. (Operation Valentine)
అక్కడ ఎందుకు బ్యాన్ చేస్తారు?
యుద్ధానికి సంబంధించిన అన్ని సినిమాలను గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేస్తారా అంటే.. కాదు అనే చెప్పాలి. కేవలం పాకిస్థాన్‌ను తప్పుగా దోషిగా చూపించే సినిమాలను మాత్రమే గల్ఫ్ దేశాల్లో ప్రదర్శించేందుకు ఒప్పుకోరు. పఠాన్‌కోట్‌లో పాకిస్థాన్‌కి చెందిన ఉగ్రవాదులే మన సైనికులపై దాడులకు పాల్పడ్డారు. వారిపై పగ తీర్చుకునేందుకు భారత ప్రభుత్వం బాలాకోట్ మెరుపు దాడులను చేపట్టింది. సో ఈ సినిమాలో పాకిస్థాన్ గురించి కచ్చితంగా తప్పుగానే చూపించి ఉంటారు. అందుకే గల్ఫ్ దేశాలు ఇలా కేవలం పాకిస్థాన్‌ను టార్గెట్ చేసే సినిమాలను విడుదల చేసేందుకు ఒప్పుకోదు. గల్ఫ్ దేశాలకు పాకిస్థాన్‌కు మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి.
హిందీలో రిస్కేమో..!
ఆపరేషన్ వ్యాలెంటైన్‌ను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు సరే..! కానీ ఆల్రెడీ సేమ్ కాన్సెప్ట్, సేమ్ స్టోరీ లైన్‌తో ఆల్రెడీ హృతిక్ రోషన్, దీపిక పదుకొణె కలిసి నటించేసారు. ఈ సినిమా జనవరిలోనే రిలీజ్ అయ్యింది. అక్కడ ఫైటర్ సినిమా పెద్దగా ఆడలేదనే చెప్పాలి. సో.. అక్కడి వారికి మన తెలుగు సినిమాలపై ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి.. ఫైటర్ సినిమా నచ్చని వారికి ఆపరేషన్ వ్యాలెంటైన్ నచ్చే ఛాన్సులు లేకపోలేదు. లేదా.. ఆల్రెడీ ఫైటర్ చూసాక సేమ్ స్టోరీ లైన్‌ను మళ్లీ ఎవరు చూస్తారు అనుకునే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.