Varun Lavanya: వివాహ బంధంతో ఒక్క‌టైన జంట‌.. 7:18కి తాళిక‌ట్టిన వ‌రుణ్‌

Varun Tej Lavanya Tripathi Marriage: మొత్తానికి మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్.. బ‌బ్లీ హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. ఇటలీలోని ట‌స్క‌నీలో వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈరోజు రాత్రి స‌రిగ్గా 7:18 గంట‌ల‌కు వ‌రుణ్ లావ‌ణ్య మెడ‌లో తాళి క‌ట్టారు. రెండు రోజుల్లో వీరు హైద‌రాబాద్ తిరిగి రానున్నారు. వ‌చ్చాక గ్రాండ్‌గా రిసెప్ష‌న్ ఏర్పాటుచేస్తారు.