Varun Lavanya: డెస్టినేషన్ వెడ్డింగ్..!
Hyderabad: ఎట్టకేలకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బబ్లీ బ్యూటీ లావణ్య త్రిపాఠిలు (varun lavanya) తమ రిలేషన్‌షిప్‌ని అఫీషియల్ చేసేసారు. నిన్న నాగబాబు నివాసంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్ (varun tej lavanya tripathi engagement) గ్రాండ్‌గా జరిగింది. అయితే వీరు పెళ్లి ఎక్కడ చేసుకోబోతున్నారు అనే దానిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. వీరిద్దరికీ ఎంతో ఫేవరెట్ ప్రదేశం అయిన ఇటలీలో వరుణ్, లావణ్యను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు పునాది పడింది కూడా ఇటలీలోనే (italy) అట. అందుకే ఆ ప్లేస్‌ని సెంటిమెంట్‌గా భావిస్తున్నారని టాక్. ఇటలీలోని ఓ మంచి ప్రైవేట్ రిసార్ట్‌లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇందుకోసం ఏ రిసార్ట్ అయితే బాగుంటుందో వరుణ్, లావణ్యల టీం తెగ వెతికేస్తున్నారు. ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా జరిగిపోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి పెళ్లి తర్వాత లావణ్య సినిమాలు చేస్తారా? మానేస్తారా? అనేది వేచి చూడాలి.