Varun Tej Lavanya Tripathi: అలా మొదలైంది..!
Hyderabad: బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావ్ మైక్ అన్నట్లు.. అసలు ఎవరైనా ఊహించారా.. సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి మెగా కోడలు అవుతుందని..! వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఆయన తండ్రి నాగబాబు అప్పుడప్పుడు స్పందిస్తుండేవారు కానీ అరేంజ్డ్ మ్యారేజ్ చేస్తారనే అనుకున్నారు ఫ్యాన్స్ అంతా. కానీ వరుణ్, లావణ్య త్రిపాఠిలు ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని వార్తలు రాగానే అందరూ షాక్. ఈరోజు వరుణ్ తేజ్ విల్లాలో ఘనంగా నిశ్చితార్ధం జరుగుతోంది. అసలు వీరి లవ్ స్టోరీ ఎలా మొదలైందో చూద్దాం.
2017లో వచ్చిన మిస్టర్ సినిమాలో వరుణ్, లావణ్యలు మొదటిసారి కలుసుకున్నారు. షూటింగ్ సమయంలో వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. కానీ ఇద్దరూ ఈ విషయాన్ని బయటపెట్టాలనుకోలేదు. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలోనూ కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, ఈవెంట్లకు వెళ్లడం వంటివి చేస్తుండేవారు. అప్పుడే వీరు డేటింగ్‌లో ఉన్నారంటూ మొదటిసారి వార్తలు వచ్చాయి. కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక పెళ్లి రాజస్థాన్‌లో జరిగినప్పుడు కూడా లావణ్య త్రిపాఠి అందరికంటే ముందే వెళ్లి పెళ్లి పనుల్లో సాయం చేసారు. అప్పుడే వరుణ్, లావణ్యల డేటింగ్ విషయం నిజమేనని కాస్త క్లారిటీ వచ్చింది. గతేడాది డిసెంబర్ 15న వరుణ్ లావణ్యకు పెళ్లి ప్రపోజల్ చేసాడు. ఇదే సంవత్సరంలో వీరి పెళ్లి కూడా జరిగిపోతుందని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ మెగా బ్రదర్ నాగబాబు కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక లావణ్య గురించి చెప్పాలంటే 1990లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జన్మించింది. లావణ్య తండ్రి హైకోర్టులో లాయర్. తల్లి టీచర్‌గా చేసి రిటైర్ అయ్యారు. లావణ్యకు అన్న అక్క ఉన్నారు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో అలరించింది.