Varun Lavanya: వైర‌ల్ అవుతున్న మెగా ప్రిన్స్ గాగుల్స్

Hyderabad: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (varun tej) రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఆ ఫొటోలో వ‌రుణ్ పెట్టుకున్న గాగుల్సే ఇందుకు కార‌ణం. ఆ గాగుల్స్‌పై LV అని రాసుంది. దాంతో వ‌రుణ్‌, లావ‌ణ్య (lavanya tripathi) పేర్లు వ‌చ్చేలా క‌స్ట‌మైస్డ్ గాగుల్స్ తీసుకున్నాడేమోంటూ కొంద‌రు కామెంట్స్ పెడుతున్నారు. అయితే వ‌రుణ్ పెట్టుకుంది ప్ర‌ముఖ ఫ్రెంచ్ ల‌గ్జ‌రీ బ్రాండ్ లూయీ విట్ట‌న్ (louis vuitton) గాగుల్స్. ఈ విష‌యం చాలా మందికి తెలిసిన‌ప్ప‌టికీ రెండు అక్ష‌రాలు భ‌లే క‌లిసాయి అంటూ స‌ర‌దాగా కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం లావ‌ణ్య త్రిపాఠితో నిశ్చితార్థం అయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో వ‌రుణ్ (varun tej) బిజీగా ఉన్నారు.