Varun Tej: కాబోయే భార్యతో కప్పు కాఫీ..!
varun tej lavanya tripathi: కాబోయే కపుల్ వరుణ్ తేజ్ (varun tej), లావణ్య త్రిపాఠి (lavanya tripathi) మరోసారి కాఫీ డేట్‌కి వెళ్లారు. జూబ్లీహిల్స్ సమీపంలోని కెఫెకు వెళ్లి కాఫీ, బ్రేక్‌ఫాస్ట్ చేసారట. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. నెల రోజుల క్రితం కూడా వీరిద్దరూ కాఫీ డేట్‌కి వెళ్లారు. అప్పుడు వీరితో పాటు నిహారిక కొణిదెల కూడా ఉన్నారు. పెళ్లి సమయం దగ్గరపడుతుండడంతో తమ బ్యాచిలర్ లైఫ్‌ని ఇలా ఎంజాయ్ చేస్తున్నారేమో..!
ఇక పెళ్లి గురించి చెప్పాలంటే.. నవంబర్‌లో వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికీ ఎంతో ఫేవరెట్ ప్రదేశం అయిన ఇటలీలో వరుణ్, లావణ్యను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు పునాది పడింది కూడా ఇటలీలోనే (italy) అట. అందుకే ఆ ప్లేస్‌ని సెంటిమెంట్‌గా భావిస్తున్నారని టాక్. ఇటలీలోని ఓల్డ్ ప్యాలెస్‌లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. (varun lavanya marriage)
