Varun Tej: ఇరికించేసిన సుమ‌.. లావ‌ణ్య ఏమంటుందో..!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (varun tej) న‌టించిన గాండివ‌ధారి అర్జున ప్రీ (gandeevadhari arjuna) రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్‌గా జ‌రిగింది. ఈవెంట్‌ని సుమ హోస్ట్ చేసింది. అయితే ఈవెంట్ మ‌ధ్య సుమ వరుణ్‌ని ఒక ట్రికీ ప్ర‌శ్న అడిగి ఇరికించేసింది. నిహారిక‌, లావ‌ణ్య త్రిపాఠిల నుంచి ఒకేసారి ఎమ‌ర్జెన్సీ మెసేజ్‌లు వ‌స్తే ముందు ఎవ‌రికి కాల్ చేస్తారు అని సుమ వ‌రుణ్‌ని అడిగింది. వ‌రుణ్‌కి ఏం చెప్పాలో తెలీక సిగ్గుప‌డుతూ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ త‌ర్వాత బాగా ఆలోచించి చెల్లెలు నిహారిక‌కే చేస్తాను ఎందుకంటే త‌ను వ‌య‌సులో చిన్న‌ది కాబ‌ట్టి అని తెలివిగా ఆన్స‌ర్ ఇచ్చాడు. ఈవెంట్‌కి వ‌చ్చిన నిర్మాత దిల్ రాజు (dil raju) కూడా వ‌రుణ్‌ని పెళ్లి క‌ళ వ‌చ్చేసింది బాబుకి అంటూ ఆట‌ప‌ట్టించారు. (varun tej)