Varun Tej: అయ్యో.. త‌ప్పు అయిపోయిందండి..!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (varun tej) న‌టించిన గాండివ‌ధారి అర్జున సినిమా ఈరోజు రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా వరుణ్ ఫ్యాన్స్‌తో చాటింగ్ చేసారు. వ‌రుణ్‌ని ఫ్యాన్స్ ఏం అడిగారో.. దానికి వరుణ్ ఎలాంటి స‌మాధానాలు ఇచ్చారో చూద్దాం.

చ‌ర‌ణ్ అన్న‌తో మల్టీస్టార‌ర్ చేస్తావా అన్నా?

త‌ప్ప‌కుండా చేస్తాను

డైరెక్ట‌ర్ మీద న‌మ్మ‌కంతో ఈ సినిమాను ఒప్పుకున్నారా అన్నా? (varun tej)

ఈ సినిమాతోని ఎమోష‌న్ నాకు చాలా న‌చ్చింది

గాండివ‌ధారి అర్జున సినిమా ఫ్యామిలీతో చూడ‌చ్చా?

త‌ప్ప‌కుండా

ప్యాన్ ఇండియా సినిమా ఏమ‌న్నా చేస్తున్నావా?

ఆప‌రేష‌న్ వ్యాలెంటైన్ & మ‌ట్కా సినిమాలు చేస్తున్నా

నీ క‌టౌట్‌కి మాస్ సినిమా ఎప్పుడు తీస్తావ్?

త్వ‌ర‌లో

టెన్ష‌న్‌గా ఉన్నావా? రిలాక్స్‌డ్‌గా ఉన్నావా?

చిల్డ్‌గా ఉన్నా

క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తావా బ్రో?

త‌ప్ప‌కుండా

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో మ‌ల్టీస్టారర్ సినిమా చేయాల‌ని లేదా బ్రో?

బాబాయ్‌తో యాక్ట్ చేస్తే ఛాన్స్ వ‌స్తే ల‌క్కీ

అన్నా.. రామ్ చ‌ర‌ణ్ ప‌వ‌న్‌తో ఎప్పుడు సినిమా చేస్తారో మా త‌ర‌ఫున అడుగుతారా?

అది జ‌ర‌గాల‌ని నేనూ ఎదురుచూస్తున్నా

ఇష్ట‌మైన వంట‌కాలు?

అమ్మ చేసిన వంట‌లు అన్నీ

మా అమ్మాయిల హార్ట్ బ్రేక్ చేసావ్ వ‌రుణ్..

అయ్యో త‌ప్పు అయిపోయిందండి (varun tej)

స్పోర్ట్స్ బేస్డ్ సినిమా ఒక‌టి చేస్తారా బ్రో?

ఏంటి జోకా?