Varun Tej: వైర‌ల్ అవుతున్న ఇన్విటేష‌న్ కార్డు!

Hyderabad: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (varun tej), లావ‌ణ్య త్రిపాఠిలు (lavanya tripathi) ప్రేమించుకుంటున్నార‌ని ఎప్ప‌టినుంచో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. పైగా వీరి పెళ్లికి వ‌రుణ్ తండ్రి నాగ‌బాబు (naga babu) ఒప్పుకున్నార‌ని, రేపు అంటే జూన్ 9న ఘ‌నంగా నిశ్చితార్థం (engagement) జ‌ర‌గ‌నుంద‌ని కూడా అంటున్నారు. అయితే దీనిపై వ‌రుణ్ కానీ లావ‌ణ్య కానీ స్పందించ‌లేదు. అయితే వారిద్ద‌రి ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన ఇన్విటేష‌న్ కార్డు ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వ‌రుణ్ తేజ్ పబ్లిసిస్ట్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించేసారు. మ‌రోప‌క్క వ‌రుణ్ (varun tej) ప్ర‌స్తుతం ఇట‌లీలో ఉన్నాడు. లావ‌ణ్య (lavanya tripathi) ఇండియాలోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. రేపు నిశ్చితార్థం వ‌రుణ్ ఇంట్లోనే ఫ్రెండ్స్, ఫ్యామిలీ సభ్యుల న‌డుమ సింపుల్‌గా జ‌ర‌గ‌నుంద‌ట‌. నిశ్చితార్ధం అయ్యాక ఇద్ద‌రూ సోష‌ల్ మీడియాలో అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌నున్నారు.