Varun Lavanya: పెళ్లి షాపింగ్ షురూ…!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి (varun lavanya). ఈ నేపథ్యంలో వారి పెళ్లి షాపింగ్ మొదలైపోయింది. ఈరోజు ఉదయం లావణ్య, వరుణ్ కలిసి హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా (manish malhotra) షోరూంకి వెళ్లారు. పెళ్లి దుస్తులను స్పెషల్‌గా డిజైన్ చేయించుకోనున్నారు. నవంబర్‌లో వీరి వివాహం జరగనుంది. ఇటలీలో పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది. కేవలం ఇంట్లో వారినే ఆహ్వానించనున్నారట. రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా హైదరాబాద్‌లో జరుగుతుంది. (varun tej lavanya tripathi marriage)