విరుష్క పెళ్లి జ‌రిగిన ప్ర‌దేశంలోనే వ‌రుణ్ లావ‌ణ్య‌ల పెళ్లి.. ఫోటోలు వైర‌ల్!

Varun Tej Lavanya Tripathi Marriage: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్.. బ‌బ్లీ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠిల (varun lavanya marriage) వివాహం న‌వంబ‌ర్ 1న ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. వీరి వివాహానికి ఇటలీ వేదిక కానుంది. అయితే పవ‌ర్ క‌పుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ (virushka) ఎక్క‌డైతే పెళ్లి చేసుకున్నారో వ‌రుణ్ లావ‌ణ్య‌ల వివాహం కూడా అక్క‌డే జ‌ర‌గ‌నుంది. అదే ఇట‌లీలోని (italy) అంద‌మైన ట‌స్క‌నీ (tuscany) న‌గ‌రం. ఈ ట‌స్క‌నీ న‌గ‌రంలోనే విరుష్క‌ల వివాహం జ‌రిగింది. వ‌రుణ్ లావ‌ణ్య‌ల వివాహం ట‌స్క‌నీలోని బోర్గో సాన్ ఫెలిష్ అనే రిసార్ట్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ రిసార్ట్‌లో 29 స్వీట్స్, 31 గ‌దులు రెండు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఈ రిసార్ట్ 685 హెక్టేర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్క‌డ ఒక్క రాత్రి స్పెండ్ చేయాలంటే రూ.40,000 నుంచి ల‌క్ష వ‌ర‌కు చెల్లించాల్సి ఉంటుంది.