Aadi Keshava: మెగా అభిమానులకు డబుల్​ ట్రీట్​!

Hyderabad: మెగా హీరో వైష్ణవ తేజ్ (Panja Vaisshnav Tej) నటిస్తున్న తాజా చిత్రం PVT04. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్​ తర్వాత రెండు సినిమాలతోనూ అంతగా అలరించలేకపోయాడు. ఇటీవలే నాలుగో సినిమాగా PVT04 ప్రారంభించారు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు రెండు పోస్టర్ లు రిలీజ్ చేసిన చిత్రబృందం తాజాగా టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసింది.

PVT04 అనే వర్కింగ్ టైటిల్ రూపొందుతున్న వైష్ణవ్​ నాలుగవ సినిమాకి ‘ఆదికేశవ’ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ పోస్టర్​ రిలీజ్​ చేశారు మేకర్స్​. దీంతోపాటు గ్లింప్స్​ని కూడా విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో వైష్ణవ తేజ్ పక్కా మాస్ అవతారంలో కనిపించి అదరగొట్టేశాడు. మైనింగ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతుందని తెలుస్తోంది. మైనింగ్​లో భాగంగా శివుడి గుడిని విలన్స్ కూల్చడానికి ప్రయత్నిస్తుంటే హీరో వాళ్ళని అడ్డుకోవడమే సినిమా కథ అని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో టాలీవుడ్​ మోస్ట్​ వాంటెడ్​ బ్యూటీ శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ (Joju George) విలన్ కనిపించబోతున్నారు. తమిళ సంగీత దర్శకుడు జి వి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.