Vaishnavi Chaitanya: లవ్ మీ..!
Vaishnavi Chaitanya: యూట్యూబ్ సిరీస్‌లలో నటిస్తూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ వచ్చిన వైష్ణవి చైతన్యకు బేబీ (baby) సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వైష్ణవికి వరుసగా లవ్ స్టోరీకి సంబంధించిన సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (dil raju) మేనల్లుడు ఆశిష్ రెడ్డితో (ashish reddy) కలిసి వైష్ణవి ఓ సినిమా చేయబోతోంది. ఈ సినిమాకు లవ్ మీ (love me) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమాతో పాటు ఆనంద్ దేవరకొండతో (anand devarakonda) కలిసి మరో సినిమాలో నటిస్తోంది. అంతేకాదు.. డీజే టిల్లు (dj tillu) ఫేం సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda) తోనూ ఓ సినిమాలో నటిస్తోందీ బేబీ భామ..!