Ustaad: యూట్యూబ్​ ట్రెండింగ్​లో దూసుకుపోతున్న టీజర్​!

Hyderabad: మ్యూజిక్ డైరెక్టర్  కీరవాణి (MM Keeravani) కొడుకు శ్రీసింహా(Sri Simha) హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉస్తాద్’(Ustaad). ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. ‘ఉస్తాద్’(Ustaad) టీజర్‌ యూట్యూబ్ ట్రెండింగ్స్‌లో నిలుస్తోంది. రిలీజైన ఒక్క రోజుకే 1 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. కాగా ఈ మూవీలో శ్రీసింహా(Sri Simha) సరసన కావ్య కల్యాణ్‌రామ్(Kavya Kalyan Ram) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఫణిదీప్(Phanideep) దర్శకత్వం వహించారు. వారాహి(Vaaraahi) బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మే 5న విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఫణి దీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్​ను హీరో దగ్గుబాటి రానా చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. హీరోకి చిన్నప్పటి నుంచి విమానాలు అంటే ఇష్టం. ఆకాశంలో ఎగురుతున్న విమానాలను ఆశగా అలా చూస్తుండి పోతుంటాడు. టీనేజ్ లోకి అడుగుపెట్టిన తరువాత అతనికి పైలెట్ కావాలని ఉంటుంది. కానీ పై నుంచి చూస్తే కళ్లు తిరిగే బలహీనత ఉంటుంది హీరోకి. తన ఆర్ధిక పరిస్థితికి తగినట్టుగా ఎప్పుడు చూసినా ఆయన పాత బైక్ పై తిరుగుతూ ఉంటాడు. అలాంటి అతను తన ఆర్ధిక ఇబ్బందులను, భయాలను, బలహీనతలను అధిగమించి తన కలను ఎలా నిజం చేసుకున్నాడు? అనేదే కథ. మరి ఈ కథ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్​ అయ్యేవరకు ఆగాల్సిందే!