Ustaad Bhagat Singh: గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. భ‌గత్ సింగ్ మాస్ ఎంట్రీ

Ustaad Bhagat Singh: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ టీజ‌ర్ రిలీజ్ అయింది. హ‌రీష్ శంక‌ర్ (Harish Shankar) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా టీజ‌ర్ భ‌గ‌త్ బ్లేజ్ అంటూ స‌డెన్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో డైలాగులు కాస్త పొలిటిక‌ల్ వేడెక్కించేలా ఉన్నాయి. జ‌న‌సేన ఎన్నిక‌ల గుర్తు టీ గ్లాస్ అనే విష‌యం అందిరికీ తెలిసిందే. అదే టీ గ్లాస్‌పై ప‌వ‌న్ టీజ‌ర్‌లో చెప్పిన డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. క‌చ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు.. సైన్యం.. క‌నిపించ‌ని సైన్యం అని ప‌వ‌న్ చెప్పే డైలాగ్ టీజ‌ర్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.