Ustaad Bhagat Singh: ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!

Hyderabad: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (pawan kalyan), డైన‌మిక్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ (harish shankar) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ (ustaad bhagat singh) షూటింగ్ ప్ర‌స్తుతానికి క్యాన్సిల్ అయింది. ప‌వ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారాలు, మీటింగ్‌ల‌తో బిజీగా ఉండ‌డంతో ప్ర‌స్తుతానికి సినిమా షూటింగ్ ఆపేయాల్సి వ‌చ్చింద‌ని టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఈ ఏడాదిలో అయితే ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ షూటింగ్ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల త‌ర్వాత ప‌వ‌న్‌కు టైం ఉంటే అప్పుడు ఈ సినిమా మిగ‌తా షూటింగ్ కంప్లీట్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు (hari hara veera mallu) సినిమా అయితే దేవుడికే తెలియాలి. అస‌లు క్రిష్ జాగ‌ర్ల‌మూడి ఈ సినిమాను ప్ర‌క‌టించేసి మాయం అయిపోయారు. అస‌లు ఇది ప‌వ‌న్ మూవీ లిస్ట్‌లోఉందో లేదో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. ప‌వ‌న్ నుంచి ఏవైనా సినిమాలు థియేట‌ర్‌లో సంద‌డి చేయ‌నున్నాయి అంటే అవి సుజీత్ డైరెక్ట్ చేస్తున్న OG, స‌ముద్ర‌ఖ‌ని తీసిన బ్రో (bro) సినిమాలు మాత్ర‌మే.