Ustaad Bhagat Singh: ఫస్ట్​ గ్లింప్స్​ ముహుర్తం ఫిక్స్!

Hyderabad: పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​(Pawan Kalyan) వరుస సినిమాలు, వాటికి సంబంధించిన వరుస అప్​డేట్లతో అభిమానులను సర్​ప్రైజ్​ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఓజీ(OG), హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu), ఉస్తాద్​ భగత్​ సింగ్(Ustaad Bhagat Singh) సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు పవన్​.  పవన్, హరీష్​(Harish Shankar) కాం బినేషన్లో వచ్చిన ​బ్లాక్​బస్టర్​ హిట్​ గబ్బర్​ సింగ్(Gabbar Singh) తర్వాత దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమా రూపొందుతోంది. అందువల్ల ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రారంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ ఎగ్జైటింగ్ న్యూస్ అందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా ఫస్ట్ గ్లింప్స్ ను మే11న విడుదల చేబోతున్నట్టు అప్డేట్ అందించారు.

తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించారు. డేట్​తోపాటు  తాజాగా టైమ్, ప్లేస్ ను అనౌన్స్ చేశారు. మే 11న సాయంత్రం 4:59 గంటలకు విడుదల ఈ సినిమా ఫస్ట్​ గ్లింప్స్​ను విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 35ఎంఎం థియేటర్ లో గ్రాండ్ లాంచింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి పవన్​ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఫస్ట్​ గ్లింప్స్​ ఎలా ఉండబోతోందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!