బాబోయ్.. మొసలి నెక్లెస్!
Mumbai: ఎప్పుడు ఏదో ఒక విచిత్రమైన పనితో వార్తల్లో నిలుస్తుంది బాలీవుడ్(Bollywood) బ్యూటీ ఊర్వశి రౌతేలా(Urvashi Rautela). వెరైటీ ఫ్యాషన్వేర్తో అభిమానులను ఆకర్షించే ఊర్వశి తాజాగా ఓ విచిత్రమైన నెక్లెస్ వేసుకుని సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023(Cannes Festival 2023)లో మొసలి నెక్లెస్ తో అందరినీ భయపెట్టింది. అందమైన గులాబీ రంగు ఫ్రాక్‌లో మెరిసిపోయిన ఊర్వశి మెడలో మాత్రం రెండు మొసళ్లు మెలేసుకున్నట్టున్న నెక్లెస్‌ను ధరించింది. కాస్త ఏమరపాటుగా చూస్తే నిజం బల్లుల్నే మెడలో వేసుకున్నట్లు కనిపిస్తున్న వాటిని చూసి అందరూ భయపడ్డారు. ఇదేం చిత్రమైన ఫ్యాషన్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
నగల్లో హంసలు, ఏనుగులు, పక్షులు, మయూరాలు పొదగడం వల్ల అవి మరింత అందంగా కనపడతాయి. కానీ వాటన్నింటికి భిన్నంగా బల్లి డిజైన్‌లో నెక్లెస్ ధరించి.. అందరితో బాబోయ్ అని భయపెట్టింది ఊర్వశి. గులాబీ రంగులో అందమైన డ్రెస్సులో మెరిసిపోయినా, మెడలోని బంగారు మొసలి నెక్లెస్ మాత్రం కెమెరాలను విపరీతంగా ఆకర్షించింది. ఈ మొసలి నెక్లెస్ కు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ధరించింది ఊర్వశి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 76వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ ఓపెనింగ్ అనే క్యాప్షన్ తో వాటిని అభిమానులతో పంచుకుంది.
కాగా, ఈ నెక్లెస్‌పై నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్‌తో ట్రోల్స్ చేస్తున్నారు. ‘మెడలోని ఆ మొసలి బతికి వస్తే ఫొటోషూట్ వదిలేసి పారిపోతావా’ అని ఓ నెటిజన్ అడిగితే, ‘ఈ నెక్లెస్ చాలా దారుణంగా ఉంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే కొందరికి మాత్రం ఈ నెక్లెస్ బాగా నచ్చింది. వెరైటీ ఫ్యాషన్ అంటూ ఊర్వశిని తెగ మెచ్చుకుంటున్నారు. ఇక ఊర్వశి త్వరలోనే నటి పర్వీన్ బాబీ బయోపిక్ లో నటించబోతోంది.