Urvashi Rautela: “ఎన్నిక‌ల్లో పోటీకి టికెట్ ఇచ్చారు”

Urvashi Rautela: లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు త‌న‌కు ఒక పార్టీ నుంచి టికెట్ ల‌భించింద‌ని తెలిపారు న‌టి ఊర్వ‌శి రౌతెల‌. కానీ ఏ పార్టీ టికెట్ ఇచ్చిందో మాత్రం చెప్ప‌నంటున్నారు. తాను రాజ‌కీయాల్లోకి వెళ్లాలా వ‌ద్దా అని ఆలోచిస్తున్నాన‌ని… దీనికి స‌మాధానం అభిమానులే చెప్పాల‌ని అంటున్నారు. ఫ్యాన్స్‌కి ఓకే అయితే తాను టికెట్‌ను స్వీక‌రించి ఎన్నిక‌ల‌ బ‌రిలోకి దిగుతాన‌ని తెలిపారు. మ‌రి ఏ పార్టీ నుంచి టికెట్ వ‌చ్చింది అని ఊర్వ‌శిని అడ‌గ్గా.. అది చెప్ప‌ను కానీ టికెట్ ఇచ్చింది మాత్రం న‌మ్మ‌క‌స్తుడైన నేత అని వెల్ల‌డించారు.