Urvashi Rautela: అందుకే ప‌వ‌న్ సీఎం అని ట్వీట్ చేసారా?

Hyderabad: బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌతెల‌.. (urvashi rautela) ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్‌ను (pawan kalyan) ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం అంటూ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాల అంతటా ర‌చ్చ రేపుతోంది. ట్విట‌ర్, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల‌లో ఊర్వ‌శి ఇదే పోస్ట్ పెట్టింది. ప‌వ‌న్ సీఎం ఏంటి అంటూ నెటిజ‌న్లు ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నా.. ఎన్నో హిందీ, ఇంగ్లీష్ వెబ్‌సైట్లు ఆమెను త‌ప్పుబ‌డుతూ న్యూస్ ఆర్టిక‌ల్స్ ప‌బ్లిష్ చేసినా కూడా ఊర్వ‌శి ఆ పోస్ట్‌లు డిలీట్ చేయ‌లేదు.

అయితే ఊర్వ‌శి అలా ప‌వ‌న్‌ను సీఎం అన‌డానికి కార‌ణం ఏంటో ఆమె స‌న్నిహిత వర్గాలు చెప్పాయి. ప‌వ‌న్ సీఎం కాద‌న్న విష‌యం ఊర్వ‌శికి కూడా తెలుస‌ట‌. కాక‌పోతే పాపులారిటీ కోసం ఊర్వ‌శి కావాల‌నే ఇలాంటి గిమ్మిక్కులు చేస్తూ ఉంటుంద‌ట‌. ఎందుకంటే ఊర్వ‌శి డైరెక్ట్‌గా త‌నంత‌ట తానే ట్వీట్లు, పోస్ట్‌లు పెట్ట‌రు. ఆమెకు స‌ప‌రేట్‌గా సోష‌ల్ మీడియా టీం ఉంది. ఒక ట్వీట్ చేసేముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాల‌ని ఎంతో జాగ్ర‌త్త‌గా ఆలోచించి పెడుతుంటారు. (urvashi rautela)

అలాంటిది తెలీకుండా ప‌వ‌న్‌ను సీఎం అనేసింది అంటే న‌మ్మ‌డానికి వీలుగా లేదని క్లియ‌ర్‌గా తెలుస్తోంది. పోనీ తెలీక అలా అనింది అనుకుంటే.. ఇంత ర‌చ్చ అవుతున్నా వెంట‌నే క‌రెక్ష‌న్ చేయ‌డ‌మో లేదా ట్వీట్లు, పోస్ట్‌లు డిలీట్ చేసి ఓ సారీ చెప్పి క‌వ‌ర్ చేసుకోవ‌డ‌మో చేసేది క‌దా అంటున్నారు ఆమె స‌న్నిహితులు. త‌న‌కు సంబంధించిన సినిమా కానీ సాంగ్ కానీ రిలీజ్‌కి రెడీగా ఉంటే ఊర్వ‌శి ఇలాంటివి చేసి వైర‌ల్ అవుతుంటార‌ని అంటున్నారు. (bro)

ప‌వన్, సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన బ్రో సినిమాలో ఊర్వ‌శి ఓ స్పెషల్ సాంగ్‌లో న‌టించారు. ఆ సాంగ్‌కి థియేట‌ర్‌లో ర‌చ్చ మామూలుగా లేద‌ని ఊర్వ‌శి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. థియేట‌ర్‌లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్న వీడియోల‌ను షేర్ చేసారు. (bro)