Akhil: హీరోయిన్‌ని వేధించాడు.. అత‌నిపై కేసు పెట్టిన న‌టి

Hyderabad: ఇండ‌స్ట్రీతో సంబంధం లేకుండా టాప్ సెల‌బ్రిటీల‌పై దారుణ‌మైన కామెంట్లు చేస్తుంటాడు ఉమైర్ సంధు(umair sandhu). ఇత‌ను ఎక్క‌డి నుంచి వ‌చ్చాడో ఏం చేస్తుంటాడో తెలీదు కానీ త‌న‌ని తాను సినీ క్రిటిక్ అని చెప్పుకుంటూ నోటిదూల‌తో ఏది ప‌డితే అది ట్వీట్ చేస్తుంటాడు. ఇటీవ‌ల న‌టుడు అక్కినేని అఖిల్(akhil akkineni) గురించి.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌతెల(urvashi rautela) గురించి అస‌భ్య‌క‌రంగా కామెంట్ చేసాడు. అఖిల్(akhil) న‌టించిన ఏజెంట్ సినిమాలో ఊర్వ‌శి ఓ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. ఈ నేప‌థ్యంలో ఉమైర్ ట్వీట్ చేస్తూ.. అఖిల్.. సెట్స్‌లో ఊర్వ‌శిని వేధించాడ‌ని, అత‌నికి సంస్కారం లేద‌ని ఊర్వ‌శి మీడియాతో చెప్పింద‌ని అన్నాడు. షూట్ స‌మయంలో ఊర్వ‌శి అఖిల్‌తో క‌లిసి డ్యాన్స్ చేయ‌డానికి ఇబ్బందిప‌డింద‌ని అన్నాడు. దాంతో ఈ విష‌యం కాస్తా ఊర్వ‌శి దృష్టికి వ‌చ్చింది. వెంట‌నే ఊర్వ‌శి త‌న టీం ద్వారా ఉమైర్‌పై కేసు పెట్టింది. ఇలాంటివారు స‌మాజానికి ఎంతో డేంజ‌ర్ అని కామెంట్ చేసింది.