Urvashi Rautela: జ‌గ‌నా..? ప‌వ‌నా..?

Hyderabad: బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌతెల (urvashi rautela) తెలుగు సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌తో ఆక‌ట్టుకుంటున్నారు. వాల్తేరు వీర‌య్య (waltair veerayya) సినిమాలో బాస్ పార్టీ సాంగ్‌లో అద‌రగొట్టిన ఊర్వశి.. ఇప్పుడు బ్రో (bro) సినిమాలో కూడా ఓ సాంగ్‌లో క‌నిపించారు. రామ్ పోతినేని (ram pothineni) న‌టిస్తున్న స్కంద (skanda) సినిమాలో కూడా ఊర్వ‌శి స్పెష‌ల్ సాంగ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. బ్రో రిలీజ్ అయిన సంద‌ర్భంగా ఊర్వ‌శి ఫ్యాన్స్‌తో ట్విట‌ర్‌లో చిట్ చాట్ చేసారు.  (urvashi rautela)

AskUrvashi అని ట్వీట్ చేసారు కానీ కేవ‌లం ఒకే ఒక్క ఫ్యాన్ అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె స‌మాధానం చెప్పారు. ఆ త‌ర్వాత ఎంతో మంది ఎన్నో ప్ర‌శ్న‌లు అడిగినా కూడా వాటికి స‌మాధానం ఇవ్వ‌లేదు. కానీ ప‌వనా జ‌గ‌నా అని అడిగిన ప్ర‌శ్న‌కు మాత్రం ప‌వ‌న్ (pawan kalyan) అని స‌మాధానం ఇచ్చారు. బ్రో సినిమా రిలీజ్‌కి ముందు కూడా ఊర్వ‌శి ట్వీట్ చేస్తూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని రాసేసారు. ఆ త‌ర్వాత ఆమెపై చాలా ట్రోలింగ్ అయింది. చాలా సేపు త‌ర్వాత మిస్టేక్ రియ‌లైజ్ అయ్యి ఆ ట్వీట్ డిలీట్ చేసేసారు. మ‌ళ్లీ ఇప్పుడు ఓ ఫ్యాన్ పవనా జ‌గ‌నా అని అడిగిన ప్ర‌శ్న‌కు మాత్ర‌మే స‌మాధానం చెప్పారు. అస‌లు ఊర్వ‌శికి ఏపీ పాలిటిక్స్ గురించి ఏం తెలుసో ఏమో.. ఏ టాపిక్‌పై మాట్లాడితే పాపులారిటీ పీక్స్‌లో ఉంటుందో అదే టాపిక్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. మొత్తానికి సెల‌బ్రిటీ అనిపించుకున్నారు. (urvashi rautela)