Urvashi Rautela: నిమిషానికి కోటి..!
ఊర్వశి రౌతెల (urvashi rautela) స్టార్డం అమాంతం పెరిగిపోవడంతో రెమ్యునరేషన్‌ను కూడా అదే రేంజ్లో పెంచేసింది ఈ భామ. ఆమెకు స్టార్డం సినిమాల వల్ల మాత్రం రాలేదని తెలిసిపోతోంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె చేతిలో సినిమాలు ఏమీ లేవు. ఎక్కువగా క్రికెటర్ రిషబ్ పంత్ (rishab pant) గురించి కామెంట్స్ చేయడం.. అర్థంలేని వ్యాఖ్యలు చేయడం వల్లే పాపులర్ అవుతోంది. అసలు ఆఫర్లు లేకపోయినప్పటికీ ఇప్పుడు సినిమాలో ఒక నిమిషం అలా కనిపించి డ్యాన్స్ చేయడానికి అక్షరాలా కోటి రూపాయలు డిమాండ్ చేస్తోంది. ఇది నిజమేనా అని అడగ్గా.. నాలాంటి నటీనటులు ఇలాంటి రోజు కోసం ఎదురుచూస్తుంటారు అని తెలిపారు. అంటే తనకి తానే బాలీవుడ్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి అని చెప్పుకుంటున్నారు. ఇటీవల బ్రో (bro) సినిమాలో మై డియర్ మార్కండేయ సాంగ్‌లో ఆడిపాడారు ఊర్వశి. (urvashi rautela)