Urfi Javed: అప్పటివరకు నేను సెక్స్ చేయను
Urfi Javed: ఉర్ఫీ జావేద్.. ఈ అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిత్ర విచిత్రమైన దుస్తులు వేసుకుని అలా రోడ్డు మీదకు వచ్చేస్తూ ఫేమస్ అయిపోయింది. ఆమె ధైర్యాన్ని ఇప్పుడిప్పుడే ఇతర సెల్రబిటీలు కూడా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉర్ఫీ ఫాలో కర్లో యార్ అనే పాడ్‌కాస్ట్‌తో ముందుకొచ్చింది. ఈ పాడ్‌కాస్ట్‌లో ఉర్ఫీ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాను సెక్స్ చేసి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతోందట. అయితే ఇప్పుడు తనకు ఆ ఇంట్రెస్ట్ లేదని.. తాను మళ్లీ సెక్స్ అంటూ చేస్తే అది తాను ఓ ప్రైవేట్ జెట్ కొనుక్కున్నాకే అని అంటోంది. తాను స్వతంత్రంగా అన్నీ సంపాదించుకున్నాకే తన జీవితంలోకి ఓ మగాడికి ప్రవేశం ఉంటుందని.. అప్పటివరకు తాను ఏ అబ్బాయికీ కనీసం ముద్దు పెట్టడం లాంటివి కూడా చేయనని ప్రతిజ్ఞ బూనినట్లు తెలిపింది.