Shooting Updates: ఈరోజు హైద‌రాబాద్‌లో 🔥 🎥

Hyderabad: ఈరోజు హైద‌రాబాద్‌లో ఐదు సినిమాల షూటింగ్స్ జ‌రుగుతున్నాయి. వాటిలో మూడు సినిమాలు భారీ బ‌డ్జెట్‌తో తీస్తున్న‌వి. ఇంత‌కీ ఏ సినిమాల షూటింగ్స్ జ‌రుగుతున్నాయంటే…. (shooting updates)

గేమ్ ఛేంజ‌ర్ (game changer)

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ (ram charan) శంక‌ర్ (shankar) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న గేమ్ ఛేంజర్ (game changer) సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం బ‌షీర్‌బాఘ్‌లోని ఓ కాలేజ్‌లో జ‌రుగుతోంది. ఇందులో చ‌ర‌ణ్ స్టూడెంట్‌గా క‌నిపించ‌బోయే సీన్స్ ఉన్నాయి. వాటిని బ‌షీర్‌బాఘ్ కాలేజ్‌లో షూట్ చేస్తున్నారు.

దేవ‌ర‌ (devara)

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (jr ntr) యాక్ట్ చేస్తున్న దేవ‌ర (devara) సినిమా షూటింగ్ కూడా హైద‌రాబాద్‌లోనే జ‌రుగుతోంది. ఎన్టీఆర్‌కి, విల‌న్‌గా న‌టిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌కి (saif ali khan) మ‌ధ్య ఫైట్ సీన్స్‌ను కొర‌టాల శివ (koratala siva) శంషాబాద్‌లో షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌కి సంబంధించిన షూటింగ్‌లో ఇదే లాస్ట్ అట‌. (shooting updates)

పుష్ప ది రూల్ (pushpa the rule)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) సుకుమార్ (sukumar) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న పుష్ప ది రూల్ (pushpa the rule) సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. షూటింగ్ చూడ‌టానికి వెళ్లిన కొంద‌రు వ్య‌క్తులు లీక్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈరోజు హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న షూటింగ్‌లో కేవ‌లం అల్లు అర్జున్‌కి సంబంధించిన సీన్స్ డైరెక్ట్ చేస్తున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ 13 (vd13)

రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ (vijay devarakonda) 13వ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో స్టార్ట్ అయింది. విజ‌య్‌కి సంబంధించిన‌ ఇంపార్టెంట్ సీన్స్‌ని హైద‌రాబాద్‌లో షూట్ చేస్తున్నారు.

యాత్ర 2 (yatra 2)

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) చేసిన పాద‌యాత్ర నేప‌థ్యంలో మ‌హి వి రాఘ‌వ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ‌బోతోంది. ఈరోజు కొన్ని మెయిల్ సీన్ల‌ను హైద‌రాబాద్‌లో షూట్ చేస్తున్నారు. జ‌గ‌న్ క్యారెక్ట‌ర్‌లో ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు జీవా (jeeva) యాక్ట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. (shooting updates)