Upasana: చరణ్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అదే!
Hyderabad: రామ్ చరణ్ (ram charan), ఉపాసనలు (upasana) ఈరోజు తమ 11వ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. త్వరలో పండంటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్న ఆనందంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఉపాసన.. చరణ్‌కు తనకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ గురించి బయటపెట్టారు. వ్యాలెంటైన్స్ డే రోజు తనకు చరణ్ ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసారని అన్నారు. హార్ట్ షేప్‌లో ఉన్న కమ్మలు ఇచ్చారని, అవి ఇప్పటికీ మెమొరీగా దాచుకున్నానని తెలిపారు. 2012లో రామ్ చరణ్ (ram charan), ఉపాసనల (upasana) వివాహం జరిగింది. దాదాపు పదేళ్ల తర్వాత వారు ఇద్దరు కాస్తా ముగ్గురు కాబోతున్నారు. ఈ విషయం గురించి ఉప్సీ మాట్లాడుతూ.. సొసైటీకి నచ్చినప్పుడు కాకుండా తమకు నచ్చినప్పుడు బిడ్డను కనాలన్న డెసిషన్ తీసుకున్నందుక సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పుడు ఫ్యామిలీలపై డిపెండ్ అవ్వకుండా సొంతంగా బిడ్డకు కావాల్సినవన్నీ సమకూర్చుకునేంత డబ్బు సంపాదించుకున్నామని అన్నారు. బిడ్డను కూడా ఇండియాలోనే కనాలనుకుంటున్నట్లు చెప్పారు.