Upasana Kamineni: విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఉపాస‌న కామెంట్స్

Upasana Kamineni: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌రణ్ (ram charan) స‌తీమ‌ణి ఉపాస‌న కామినేని.. ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ (thalapathy vijay)  రాజ‌కీయ ఎంట్రీపై కామెంట్స్ చేసారు. ఎప్ప‌టినుంచో విజ‌య్ రాజ‌కీయాల్లోకి రాబోతున్నార‌ని టాక్ వినిపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఇటీవ‌ల త‌మిళ‌గ వెట్రి క‌ళ‌గం (TVK) అనే పేరుతో పార్టీని స్థాపించిన‌ట్లు ప్ర‌క‌టించారు.  దీనిపై ఉపాసన స్పందిస్తూ.. ఇది చాలా గొప్ప నిర్ణ‌యం అని అన్నారు. త‌మిళ సినిమాను గెలిచిన విజ‌య్ ఇప్పుడు రాజ‌కీయంగానూ త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోవాల‌ని విజ‌య్ అనుకుంటున్నందుకు సంతోషంగా ఉంద‌ని అన్నారు. (upasana kamineni)

2026లో త‌మిళ‌నాడులో జ‌ర‌గబోయే ఎన్నిక‌ల్లో విజ‌య్ పోటీ చేయ‌నున్నారు. అయితే ఇప్పుడు విజ‌య్ పార్టీ పెట్ట‌డం వల్ల త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. విజ‌య్ పార్టీ వ‌ల్ల ఎవ‌రికి న‌ష్టం అని ఇప్ప‌టి నుంచే స‌న్నాహాలు వేసేస్తున్నారు. ఇంకొన్ని పార్టీలు విజ‌య్ రాక‌తో తెగ ఫీలైపోతున్నారు.

విజ‌య్ పార్టీ పెట్టడం వ‌ల్ల‌ తమిళ‌నాడులోని AIADMK పార్టీ ఓట్లు చీలే అవ‌కాశం ఉంది. త‌మిళ‌నాడు మాజీ సీఎం ప‌ళ‌నిస్వామి AIADMKని ముందుండి న‌డిపిస్తున్నారు. కానీ ఇది పన్నీర్ సెల్వం, శ‌శిక‌ళ‌కు రుచించ‌డంలేదు. దాంతో ముగ్గురి మ‌ధ్య పొర‌పొచ్ఛాలు మొద‌లయ్యాయి. ఈ నేప‌థ్యంలో పార్టీలోని ఇత‌ర నేత‌లు విజ‌య్ పార్టీలో చేరే అవ‌కాశం లేక‌పోలేదు. సాధార‌ణంగా ఇలాంటి పొలిటిక‌ల్ అంశాలపై ఉపాస‌న అస్స‌లు స్పందించ‌రు. అందులోనూ ఇది మ‌న రాష్ట్రానికి సంబంధించినది కాదు. అయిన‌ప్ప‌టికీ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. (upasana)